

భారత క్రికెట్లో వెలుగుతున్న యువ తార వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గూగుల్ విడుదల చేసిన 2025 మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్‌లో మొదటి స్థానం సాధించి సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు.
ఐపీఎల్లో చేసిన అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వైభవ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. తక్కువ వయసులోనే రాణించిన అతడి ప్రతిభ సెర్చ్ లిస్టులో అగ్ర స్థానాన్ని తెచ్చిపెట్టింది.
వైభవ్ తర్వాత ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ మూడో స్థానాన్ని, షేక్ రషీద్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.
మహిళల విభాగంలో జెమిమా రోడ్రిగ్స్ 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ హైప్ కారణంగా భారీ సెర్చ్ వాల్యూమ్‌ను సాధించారు.
ఆశ్చర్యకరంగా, ఐపీఎల్ 2025, బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ చర్చలు ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు ఈసారి మోస్ట్ సెర్చ్డ్ లిస్టులో కనిపించలేదు. క్రికెట్ అభిమానుల్లో కొత్త తరం స్టార్లకున్న క్రేజ్‌ను ఈ లిస్టు స్పష్టంగా చూపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!