
ఆరోగ్యం

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 లో జరిగిన 5 వ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు, యూపీ వారియర్స్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ గ్రేస్ హారిస్ 40 బంతుల్లో 85 పరుగులతో చెలరేగగా, కెప్టెన్ స్మృతి మంధాన నిలకడగా సహకరించి తొలి వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా, దీప్తి శర్మ–డియాండ్రా డొట్టిన్ జోడీ 93 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చింది. ఆర్సీబీ బౌలింగ్లో శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, యూపీ వారియర్స్ రెండో ఓటమిని ఎదుర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!