

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న వేళ బీసీసీఐ ప్రకటించిన టీమ్ ఇండియా జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి గిల్ ఎంపిక కాకపోవడం అనూహ్యమని మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల టీ20ల్లో ఫామ్ లేకపోవడమే కారణంగా గిల్‌ను పక్కన పెట్టడం సరైందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశం పై స్పందించిన యోగ్రాజ్ సింగ్, కేవలం నాలుగు లేదా ఐదు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే ఆటగాడిని జట్టు నుంచే తొలగిస్తారా అని ప్రశ్నించారు. వంద అవకాశాల్లో కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించే ఆటగాళ్లు ఇంకా జట్టులో కొనసాగుతుండటం అన్యాయమని అన్నారు. యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని సూచిస్తూ, బిషన్ సింగ్ బేడీ నాయకత్వంలో కపిల్ దేవ్ విఫలమైనప్పటికీ అతడిని ఇంగ్లండ్ టూర్‌కు తీసుకెళ్లిన ఉదాహరణను ప్రస్తావించారు. అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు కూడా సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!