

టీమ్ ఇండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ ను టీ20 ప్రపంచకప్ 2026 జట్టుకు ఎంపిక చేయకపోవడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జట్టు సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పినప్పటికీ, గిల్ ప్రస్తుత పేలవ ఫామ్‌నే ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జట్టు ఎంపిక సమయంలో గిల్ అంశం పై సెలెక్షన్ కమిటీలో తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో అజిత్ అగార్కర్ చైర్మన్ గా ఉండగా, శివ్ సుందర్ దాస్, అజయ్ రత్నా, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా సభ్యులుగా ఉన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు అగార్కర్ గిల్ కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాతో పాటు మరో సెలెక్టర్ గిల్ ఎంపికకు వ్యతిరేకంగా నిలిచినట్టు సమాచారం. సెలెక్షన్ మీటింగ్‌కు ముందే గిల్ ప్రస్తుత టీ20 ఫార్మాట్‌కు సరిపోడన్న అభిప్రాయానికి ఆ ముగ్గురు వచ్చినట్టు తెలుస్తోంది. కమిటీలో మెజారిటీగా ముగ్గురు సభ్యులు వ్యతిరేకించడంతో గిల్‌ను జట్టులోకి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందే గిల్‌కు ఈ నిర్ణయాన్ని తెలియజేసినట్టు సమాచారం. ఇటీవల కాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న గిల్, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. మొత్తం 15 ఇన్నింగ్స్‌ల్లో అతను చేసిన పరుగులు కేవలం 291 మాత్రమే కావడం సెలెక్టర్ల నిర్ణయం పై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!