
జనరల్

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ హాకీ ఆటగాళ్ల ఫిట్నెస్పై ప్రశంసలు కురిపించారు. బెంగళూరులో జరిగిన ‘ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ, భారత క్రికెటర్ల ఫిట్నెస్ హాకీ ఆటగాళ్లతో పోలిస్తే కనీసం 15 శాతం కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. హాకీ ప్లేయర్ల శారీరక శక్తి, కఠిన శ్రమ అసాధారణమని ఆయన కొనియాడారు.
మన దేశంలో క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇతర క్రీడలను తక్కువగా చూస్తున్నామని కోహ్లీ అన్నారు. ఫిట్నెస్ను సాధారణంగా చూడాలని, అది అథ్లెట్లకు తప్పనిసరి అంశమని ఆయన స్పష్టం చేశారు. కోహ్లీ వ్యాఖ్యలపై భారత హాకీ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, ఆయన మాటలు తమకు మరింత ప్రేరణ ఇస్తాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!