

ఏస్ షట్లర్ పీ.వి. సింధు ఇటీవల పోటీల సమయంలోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ కణత వద్ద ప్రత్యేక పరికరంతో కనిపించడం ఆసక్తి రేపుతోంది. బెంగళూరులో జరిగిన క్రీడా సమ్మేళనంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ను కలిసిన సందర్భంలో కూడా ఆమె అదే పరికరాన్ని ధరించింది. “టెంపుల్” పేరుతో రూపొందించిన ఈ పరికరం కృత్రిమ మేధస్సుతో పనిచేసే చిప్‌గా గుర్తింపు పొందుతోంది.
ఈ పరికరం అథ్లెట్ల మెదడులో రక్తప్రసరణ, మానసిక స్థితి, ఒత్తిడి స్థాయిలను విశ్లేషించగలదు. దీనివల్ల కోచ్‌లు మరియు శిక్షకులు ఆటగాళ్ల శిక్షణ, విశ్రాంతి, మానసిక సిద్ధతపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ సాంకేతిక పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ పరికరం భవిష్యత్తులో అథ్లెట్లకు గొప్ప సహాయకారిగా మారనుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!