

వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాపై జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, విరాట్ కోహ్లీ మరియు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కలిసి చేసిన రీల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అర్ష్‌దీప్ షేర్ చేసిన ఈ వీడియో ఒక్క రోజు వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్‌ను దాటింది. యశస్వి జైస్వాల్ (116), రోహిత్ శర్మ (75) భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం అందించడంతో లక్ష్యం తగ్గిపోవడంతో కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయినా 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రీల్లో అర్ష్‌దీప్, “లక్ష్యం చిన్నది కావడంతో సెంచరీ మిస్ అయ్యింది కదా పాజీ?” అని సరదాగా అడగగా, “టాస్ గెలిచాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ డ్యూకి నువ్వే సెంచరీ కొట్టేవాడివి” అంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సరదా వీడియోను చూడటానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. రీల్ కోసం అర్ష్‌దీప్ కోహ్లీని ఒప్పించిన బ్యాక్‌స్టేజ్ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!