

విరాట్ కోహ్లీ ఐపీఎల్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈవో రాజేశ్ మేనన్ చెక్ పెట్టారు. వచ్చే వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశముందని, అలాగే త్వరలోనే ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రాజేశ్ మేనన్ ఖండిస్తూ కోహ్లీ ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడతాడని స్పష్టం చేశారు.
“ఆర్సీబీ, కోహ్లీ ఒకే నాణేనికి రెండు వైపులు” అని పేర్కొన్న మేనన్, అతను క్రికెట్‌కు దూరమైనా ఫ్రాంచైజీతో అనుబంధం కొనసాగుతుందని చెప్పారు. కోహ్లీ కనీసం మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఐపీఎల్‌లో కొనసాగుతాడని, అతడి ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని తెలిపారు. మరోవైపు గాయం కారణంగా ఇటీవల వన్డేలకు దూరమైన కోహ్లీ పునరావాస ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!