
జనరల్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజాగా జట్టు మేనేజ్‌మెంట్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తనపై జరుగుతున్న స్పష్టత లేని కమ్యూనికేషన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టుకు తన అవసరం ఉందని భావించినప్పుడే తాను కొనసాగుతానని, ఇకపై ఎవరికీ తన విలువ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా వన్డేల్లో అద్భుత ప్రదర్శనలు కొనసాగిస్తున్న కోహ్లి, సెలెక్టర్లు మరియు కోచ్‌ల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక వారం మద్దతు తెలుపుతూ, మరో వారం ఆటతీరును ప్రశ్నించడం సరైంది కాదన్నారు. స్పష్టతతో వ్యవహరించాలని, లేకపోతే ప్రశాంతంగా ఆడనివ్వాలని వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!