
రాజకీయాలు

హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ వేటను భారత మహిళల జట్టు డ్రాతో ప్రారంభించింది. పూల్-డీలో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ 2-2తో చైనాతో పోరును డ్రాగా ముగించింది. తొలి మూడు క్వార్టర్లలో ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు గెలుపు దిశగా సాగినా.. చివరి దశలో చైనాకు గోల్ సమర్పించుకోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.
భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ 8వ నిమిషంలో, దీపిక 26వ నిమిషంలో గోల్స్ చేశారు. చైనా తరఫున ఝాంగ్ యింగ్ 14వ నిమిషంలో, మా నింగ్ 39వ నిమిషంలో గోల్స్ సాధించారు. తదుపరి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఈ నెల 18న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత్ సోమవారం తమ రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!