
సినిమాలు

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు బాదిన బ్యాటర్ల ప్రత్యేక జాబితాలోకి పంత్ చేరాడు. ఈ మైలురాయిని అందుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు.
కేవలం 89 ఇన్నింగ్స్‌ల్లోనే 100 సిక్సర్ల మార్క్‌ను చేరుకున్న రిషభ్ పంత్, ఇన్నింగ్స్‌ల పరంగా ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్, ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఇప్పటికే ఉండగా.. తాజాగా పంత్ కూడా వారి సరసన చేరాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!