

షెడ్యూల్ కంటే ఆలస్యంగా హైదరాబాద్ (Hyderabad)లో సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) పర్యటన కొనసాగుతోంది. మరో గంటలో ఆయనతో పాటు సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో గంటలో ఉప్పల్ స్టేడియంకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలోనే మెస్సీ అభిమానులు వేలల్లో ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
మరోవైపు స్టేడియంలో ప్రఖ్యాత సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ మ్యూజికల్ ఈవెంట్ హైలైట్గా నిలిచింది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో మెస్సి జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ చివరి 5 నిమిషాలు మైదానంలోకి మెస్సి, రేవంత్ రెడ్డి దిగి ప్రేక్షకులను అలరించనున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సి ఆల్టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉండనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!