

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చెందడంపై భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరాజయం జట్టుకు ఒక విధంగా మేలే చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ ఈ మ్యాచ్ గెలిచివుంటే అతివిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రమాదం ఉండేదని, అది కీలక సమయంలో మరింత పెద్ద దెబ్బకు దారితీసేదని విశ్లేషించారు. తొలి మ్యాచ్లోనే జట్టులోని లోపాలు బయటపడటం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఈ ఓటమి తర్వాత సూర్యకుమార్ యాదవ్ సేన గట్టి కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి సూచించారు. ఏ విభాగాల్లో భారత్ విఫలమైంది, ఎక్కడ మెరుగుపడాలి, కొత్త ఆటగాళ్ల అవసరం ఉందా అనే అంశాలను కోచ్ గౌతమ్ గంభీర్ సమగ్రంగా సమీక్షించాలని అన్నారు. పాత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే టీమ్ ఇండియా ఈ టోర్నీలో ఛాంపియన్గా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!