
క్రీడలు

జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించారు. బుధవారం జరిగిన అండర్-18 బాలుర 400 మీటర్ల రేసులో రాము 47.21 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన మానస్ రజతం, కేరళకు చెందిన ఎబిన్ కాంస్య పతకం గెలుచుకున్నారు.
బాలుర హెప్టాథ్లాన్‌లోనూ తెలంగాణకు పతకం లభించింది. సోము 4,587 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన నాగర్ స్వర్ణం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్నిల్ రజతం సాధించారు. ఈ విజయాలతో జాతీయ స్థాయి యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!