

టీమ్ ఇండియా మరోసారి బ్యాటింగ్ దాడితో ప్రత్యర్థిని చిత్తు చేసింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సంజూ శాంసన్ వేగంగా 24 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 55 పరుగులతో మెరిశాడు. ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు. చివర్లో హార్దిక్ పాండ్యా (50 నాటౌట్), తిలక్ వర్మ (44 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో స్కోర్‌ను 250 దాటించారు. భారత్ పవర్‌ప్లేలోనే 80 పరుగులు సాధించడం మ్యాచ్ మలుపు తిప్పింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. బ్రియన్ బెన్నెట్ అద్భుతంగా 97 పరుగులతో చివరివరకు పోరాడినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ సికందర్ రజా 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (1)
nice