

వన్డే వరల్డ్ కప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న భారత మహిళా క్రికెటర్లు మళ్లీ యాక్షన్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్లు విశాఖపట్నంలో, మిగతావి తిరువనంతపురంలో జరుగనున్నాయి. ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరియు ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక రికార్డులు సాధించే దిశగా దృష్టి పెట్టారు.
స్మృతి మంధాన మరో 18 పరుగులు చేస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 4,000 రన్స్ పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా నిలుస్తుంది. ఇప్పటివరకు ఆమె 153 మ్యాచ్ల్లో 3,982 రన్స్ చేసింది. న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బేట్స్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయి చేరుకుంది. స్మృతి ఈ ఘనత సాధిస్తే, భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసినట్లే.
మరోవైపు ఆల్రౌండర్ దీప్తి శర్మ కేవలం 5 వికెట్లు తీస్తే, ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షట్ (151)ను అధిగమించి మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవుతుంది. దీప్తి ఇప్పటివరకు 129 మ్యాచ్ల్లో 147 వికెట్లు తీసింది. అదనంగా, మహిళల టీ20ల్లో 1,000 పరుగులు + 150 వికెట్లు నమోదు చేసే తొలి క్రికెటర్గా నిలిచే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - పురుషుల టీ20ల్లో కూడా ఇప్పటివరకు ఎవరూ ఈ రికార్డు నమోదు చేయలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!