
జనరల్

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగియగా, జట్టు ప్రదర్శనతో పాటు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. కేకేఆర్‌ను ఉద్దేశించి చేసిన ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రేష్ఠ అయ్యర్ తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ వీడియోను కేవలం సరదాగా చేసినదని, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది. ప్రతి క్రికెటర్‌ను గౌరవిస్తానని, తన సోదరుడు కూడా క్రికెటరే కావడంతో ఆ భావన తనకు బాగా తెలుసని తెలిపింది. అయితే ట్రోలింగ్ హద్దులు దాటిపోయాయని, తన కార్యాలయానికి ఫోన్లు చేసి వేధించడం, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను దూషించడం బాధాకరమని పేర్కొంది. ఇకనైనా ఈ ట్రోలింగ్‌ను ఆపాలని ఆమె విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!