

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఎవరికైనా ప్రశంసలు ఇవ్వడంలో అరుదుగా కనిపించే వర్మ.. ఈసారి మాత్రం జానీ మాస్టర్ పనితీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. తన తాజా చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ షూటింగ్ సమయంలో జానీ మాస్టర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓ పాట కోసం రూపొందించిన డ్యాన్స్ స్టెప్స్ తనను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు.
జానీ మాస్టర్‌కు కేవలం డ్యాన్స్పైనే కాకుండా, మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే విజువల్ ఎనర్జీపై కూడా అద్భుతమైన అవగాహన ఉందని వర్మ కొనియాడారు. సెట్స్‌లో ఆయన పనిచేసే తీరు చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అలాగే బయట కనిపించే హడావుడికి భిన్నంగా జానీ ఎంతో వినయంగా ఉంటారని చెప్పారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. ఇటీవల వివాదాల మధ్య ఉన్న జానీ మాస్టర్‌కు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మద్దతు ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!