

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందినా, అదృష్టం మాత్రం అతడిని ఇంకా వెంటాడుతూనే ఉంది. 2013లో ప్రారంభమైన అతడి ఐపీఎల్ ప్రయాణం 13 ఏళ్లకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాడు. వ్యక్తిగతంగా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ రికార్డులు సృష్టించిన రాహుల్, జట్టుగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోతున్నాడు.
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రాహుల్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. లీగ్ దశలో ఢిల్లీ జట్టు 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఏడు ఓటములతో ముగించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కీలక సమయాల్లో జట్టు విఫలం కావడం, నెట్ రన్‌రేట్ ప్రభావం కారణంగా ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో “ఐపీఎల్ అన్‌లక్కీ ప్లేయర్” అనే చర్చ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!