

త్రిష మరోసారి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో త్రిష సన్నిహిత సంబంధాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాలు త్రిష పుట్టినరోజైన మే 4న రావడంతో అభిమానులు ఆమెను విజయ్‌కు లక్కీ మాస్కట్‌గా కూడా పేర్కొన్నారు. ఇప్పుడు సూర్య నటించిన ‘కరుప్పు’ భారీ విజయాన్ని సాధించడంతో త్రిష పేరు మరోసారి వైరల్ అవుతోంది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ‘లియో’, అజిత్ కెరీర్‌లో టాప్ గ్రాసర్‌గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ఇప్పుడు సూర్యకు భారీ విజయాన్ని అందిస్తున్న ‘కరుప్పు’ చిత్రాల్లో త్రిష హీరోయిన్‌గా ఉండటం అభిమానుల్లో సెంటిమెంట్‌గా మారింది. దీంతో త్రిష తమిళ స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ బ్లాక్‌బస్టర్స్ వెనుక కామన్ ఫ్యాక్టర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!