

శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వర్షం కారణంగా రద్దైన మ్యాచ్ తర్వాత ఆమె చేసిన వీడియో ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో సరదాగా నృత్యం చేస్తూ మాట్లాడిన శ్రేష్ట, కేకేఆర్‌కు తమ వల్లే ఒక పాయింట్ దక్కిందని వ్యాఖ్యానించారు. అనంతరం పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో ఆమెపై ట్రోలింగ్ మరింత పెరిగింది.
ఈ వివాదంపై తాజాగా స్పందించిన శ్రేష్ట అయ్యర్, తాను చేసిన వీడియో పూర్తిగా సరదా కోసమేనని స్పష్టం చేశారు. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అయితే కొందరు వ్యక్తులు తనతో పాటు వ్యక్తిగత, వృత్తిపరంగా సంబంధం ఉన్న వారిని కూడా లక్ష్యంగా చేసుకొని దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ కాల్స్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతరులను లాగవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!