

అమెరికా తాజాగా హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై సైనిక దాడులు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు సముద్ర మైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, అమెరికా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ ప్రాంతంలోని క్షిపణి స్థావరాలు, నౌకాదళ బోట్లు ప్రధాన టార్గెట్లుగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను అమెరికా “సెల్ఫ్ డిఫెన్స్” చర్యగా పేర్కొంది.
దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇరాన్‌కు నష్టం జరిగినట్లు స్థానిక మీడియా చెబుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లలో ఆందోళన నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!