

ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల రికర్వ్ జట్టు వరల్డ్ కప్ స్టేజ్-2లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీపిక కుమారి, అంకిత భకత్, కుంకుమ్‌లతో కూడిన జట్టు ఆదివారం జరిగిన తుది షూటాఫ్‌లో 5-4 (28-26)తో చైనాను ఓడించి విజయం సాధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
ఫేవరెట్‌గా బరిలో దిగిన చైనాకు భారత జట్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రతిభ, ధైర్యంతో భారత ఆటగాళ్లు విజయం సాధించారు. మరోవైపు కొరియా జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తమ ప్రతిభను చాటింది.
మొత్తంగా ఈ వరల్డ్ కప్‌ను భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకంతో ముగించింది. కాంపౌండ్ పురుషుల విభాగంలో సాహిల్ జాదవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో సిమ్రంజిత్ కౌర్ కాంస్య పోరులో 4-6తో కొరియా ఆటగాడు జాంగ్ మిన్ చేతిలో ఓటమి పాలయ్యింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!