
బిజినెస్

అండర్-19 వరల్డ్ కప్ 2026ను ముద్దాడి చరిత్ర సృష్టించిన భారత యువ జట్టు కెప్టెన్ ఆయుష్ మత్రేకు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలో సచిన్ టెండూల్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయుష్కు, మాస్టర్ బ్లాస్టర్ ఒక వెలకట్టలేని బహుమతిని అందించారు. సచిన్ తన కెరీర్లో ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ (2013) కు సంబంధించిన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి ఆయుష్కు బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో ఆయుష్ ప్రదర్శన, జట్టును నడిపించిన తీరు అద్భుతమని కొనియాడారు. భవిష్యత్తులో సీనియర్ జట్టులోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రికెట్ దేవుడి చేతుల మీదుగా ఆయన జెర్సీని అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని క్షణమని ఆయుష్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!