
క్రీడలు

భారత క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2026 ఐపీఎల్ సీజన్ అనంతరం ఫ్రాంచైజీ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో ఆయన బ్యాటింగ్ ప్రదర్శనలో తగ్గుదల కనిపించడంతో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించినట్లు సమాచారం.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మకు విడుదలయ్యే అవకాశం కూడా ఇచ్చిందని, తద్వారా ఆయన వేలంలో పాల్గొని మరో జట్టుకు ఆడే అవకాశం ఉండేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇతర ఫ్రాంచైజీల కోసం ఆడకూడదని నిర్ణయించుకున్న రోహిత్, ప్రస్తుత సీజన్ అనంతరం ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!