
సినిమాలు

ఐపీఎల్ 2026 సీజన్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామంగా కెప్టెన్ రిషభ్ పంత్ తన నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని పంత్ స్వయంగా కోరగా, యాజమాన్యం తక్షణమే ఆ అభ్యర్థనను అంగీకరించింది. పంత్ సేవలను ప్రశంసించిన ఫ్రాంచైజీ జట్టును పునర్నిర్మించడంపై దృష్టి సారిస్తామని తెలిపింది. 2025 మెగా వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన పంత్, రెండు సీజన్లలో కలిపి కేవలం 10 విజయాలు మాత్రమే అందించాడు. వ్యక్తిగత ప్రదర్శనలోనూ ఆయన 269 పరుగులు (గత సీజన్), 312 పరుగులు (ఈ సీజన్) మాత్రమే సాధించాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!