
సినిమాలు

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మోహిని శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త అజిత్ అభిమానులతో పాటు సినీ వర్గాలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
మోహిని మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కుటుంబానికి ధైర్యం కలగాలని, ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం చేకూరాలని సోషల్ మీడియా వేదికగా సానుభూతి సందేశాలు తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆమె మరణం పట్ల విషాద ఛాయలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!