
క్రీడలు

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ ప్రయాణం ముగిసింది. మ్యాచ్ అనంతరం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. డగౌట్‌లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న అతని దృశ్యాలు అభిమానులను కలచివేశాయి.
మ్యాచ్‌లో రాజస్థాన్ కష్టాల్లో ఉన్న సమయంలో వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టును పోటీలో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే నాలుగు పరుగుల తేడాతో మరోసారి సెంచరీ మిస్ కావడంతో పాటు జట్టు ఓటమి చెందడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతని పోరాట పటిమకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!