
టెక్నాలజీ

రాబోయే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతారంటూ వచ్చిన వదంతులను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కొట్టిపారేశారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. సీనియర్ బ్యాటర్ల అంతర్జాతీయ కెరీర్‌కు ఈ వన్డే సిరీస్ ముగింపు పలకవచ్చని ఇటీవలి రోజుల్లో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ భారత క్రికెట్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నారని, త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే ప్రణాళికలు లేవని ఆయన ధృవీకరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!