

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరిత విజయంతో శుభారంభం చేసింది. శుక్రవారం నవీ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 20 ఓవర్లలో 157/7 స్కోరుతో ఛేదించింది.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో నడిన్ డి క్లెర్క్ అద్భుతమైన పోరాటంతో జట్టును గెలిపించింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమవ్వగా, ఆమె రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన బౌలింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సజీవన్ సజన 25 బంతుల్లో 45 పరుగులతో రాణించగా, నికోలా కారీ 40 (29 బంతులు), జి. కమలిని 32 (28 బంతులు) పరుగులు చేశారు. చివర్లో పరుగుల వేగం పెరిగినా, ఆర్సీబీ బౌలర్లలో డి క్లెర్క్ నాలుగు వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ చెరో వికెట్ తీశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!