

త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంగీత సందడి నెలకొననుంది. ఈ నెల 28న ప్రారంభమయ్యే ఈ సీజన్లో ఏఆర్ రెహ్మాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా పాటలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అభిమానులను ఉత్సాహపరిచేలా ఈ పాటలను ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రెహ్మాన్ సూపర్ హిట్ పాటలతో ఐపీఎల్ వేదిక మరింత ఉత్సాహభరితంగా మారనుంది.
పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు దేశవ్యాప్తంగా మంచి స్పందనతో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఐపీఎల్ వేదికపై ఈ పాటలు వినిపించడం ద్వారా సినిమాకు మరింత హైప్ పెరగనుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ నెల 22న గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ ఈవెంట్లో కూడా రెహ్మాన్ లైవ్ ప్రదర్శనతో పాటు ‘పెద్ది’ పాటలు హైలైట్ కానున్నాయి.














.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!