

ఆసియా క్రీడలు–2026లో భారత బ్యాడ్మింటన్ జట్టు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో పీవీ సింధు, ఉన్నతి హుడా పరాజయం పాలవడంతో వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు పతకం దక్కలేదు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు 21-11, 18-21, 10-21తో చైనాకు చెందిన చెన్ యుఫెయి చేతిలో ఓడింది. ఉన్నతి 16-21, 21-14, 17-21తో జపాన్ స్టార్ అకానే యమగూచి చేతిలో పోరాడి ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీలు కూడా క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించాయి.
గత ఆసియా క్రీడల్లో మూడు బ్యాడ్మింటన్ పతకాలు సాధించిన భారత్.. ఈసారి పురుషుల టీమ్ ఈవెంట్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత విభాగాల్లో మాత్రం ఒక్క పతకమూ రాలేదు. మరోవైపు మహిళల సెపక్‌తక్రా డబుల్స్‌లో భారత్‌కు రెండు పరాజయాలు ఎదురయ్యాయి. మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ 9వ స్థానంలో నిలవగా, ఫెన్సింగ్‌లోనూ భారత క్రీడాకారులు పతకం సాధించకుండానే నిష్క్రమించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!