
సినిమాలు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన రెండో సీడ్ Wang Zhiyi చేతిలో సింధు 16–21, 15–21 వరుస గేమ్‌లలో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిన విషయం తెలిసిందే.
గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన సింధు, సెమీస్ వరకూ అజేయంగా సాగింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన డేంజరస్ ప్లేయర్ అకానే యమగుచీని ఓడించి చివరి నాలుగులోకి అడుగుపెట్టింది. అయితే, సెమీఫైనల్లో అనూహ్య ఓటమితో ఈ టోర్నీ ప్రయాణానికి ముగింపు పలికింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!