

భారత బ్యాడ్మింటన్ స్టార్ P. V. సింధు మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 500 మ్యాచ్‌ల్లో విజయం నమోదు చేసిన ఆరో క్రీడాకారిణిగా నిలిచింది. అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది.
ఇండోనేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భాగంగా జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు, డెన్మార్క్‌కు చెందిన లైన్ హోయ్మార్క్పై 21-19, 21-18 తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ఈ మ్యాచ్ ద్వారానే సింధు 500 వ సింగిల్స్ విజయం నమోదు చేయడం విశేషం.
మహిళల సింగిల్స్‌లో సింధు కంటే ముందుగా ఈ ఘనత సాధించిన వారిలో ఇంతానన్ రచనోక్, తై జు యింగ్, అకానె యమగూచి, కరోలినా మారిన్, పెత్యా నెదెల్చెవా ఉన్నారు. డబుల్స్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే సింధు ఖాతాలో మొత్తం 516 అంతర్జాతీయ విజయాలు ఉన్నాయి.
ఇక పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో హాంకాంగ్‌కు చెందిన జేసన్ గునవాన్ను 21-10, 21-11తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
అయితే మరో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మాత్రం చైనీస్ తైపీకి చెందిన చౌ తీన్ చెన్ చేతిలో 11-21, 10-21తో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖరబ్ జపాన్‌కు చెందిన నొజొమి ఒకుహరతో జరిగిన మ్యాచ్‌లో రిటైర్డ్ కారణంగా ఓటమి ఎదుర్కొంది.
పురుషుల డబుల్స్‌లో హరిహరన్ – అర్జున్ జోడీ మలేసియాకు చెందిన వీ చాంగ్ – వున్ తీ జంటతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 17-21, 21-9, 16-21తో ఓడిపోయింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!