

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన కీలక ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210/5 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య 33 బంతుల్లో 56 పరుగులతో అదరగొట్టగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కూపర్ కనోలి 38 పరుగులు చేయగా, సూర్యాంశ్ 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 18 పరుగులు చేయగా, స్టాయినిస్ ఒక పరుగు మాత్రమే చేశాడు. శశాంక్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
పవర్‌ప్లేలో పంజాబ్ బ్యాటర్లు దూకుడుగా ఆడి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 72 పరుగులు సాధించారు. ప్రియాంశ్ ఆర్య అర్ధశతకంతో మెరిశాడు. మధ్య ఓవర్లలో దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 107/2 స్కోర్‌తో నిలిచింది. దిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. 19వ ఓవర్లో స్టార్క్ వరుస బంతుల్లో స్టాయినిస్, శశాంక్ సింగ్‌లను ఔట్ చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!