
జనరల్

బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు వెలగపూడి ప్రణవిచంద్ర కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మహిళా సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పుణెలో టోర్నమెంట్ జరగనుంది. గతంలో మూడేళ్లపాటు హైదరాబాద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రణవి.. ఇప్పుడు సారథ్య బాధ్యతలు చేపట్టనుంది.
ప్రణవి సౌత్‌జోన్ జట్టుకు కూడా ఎంపికై టీ20తో పాటు మల్టీ డే ఫార్మాట్‌లో ఆడింది. అంతేకాకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ తరఫున, యూకేలో ఎర్లింగ్ క్లబ్ తరఫున కూడా బరిలోకి దిగింది. దేశవాళీ క్రికెట్‌లో అనుభవం ఉన్న ప్రణవి నాయకత్వంలో హైదరాబాద్ జట్టు టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!