

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2025–27) చరిత్రలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో డబ్ల్యూటీసీ చరిత్రలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా 3 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన పంత్.. ఈ మ్యాచ్‌కు ముందు 2,948 పరుగులతో ఉన్నాడు. మైలురాయిని చేరుకోవడానికి 52 పరుగులు అవసరం కాగా, కేవలం 55 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 62 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాకుండా, డబ్ల్యూటీసీలో విదేశాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి, ఏకైక భారత ఆటగాడిగానూ పంత్ ఇప్పటికే రికార్డు సాధించాడు.
మరోవైపు, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఇదే రోజు డబ్ల్యూటీసీలో 3 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందు 2,917 పరుగులతో ఉన్న గిల్.. 83 పరుగులు చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. అయితే, 146 బంతుల్లో 98 పరుగులు చేసి ఔటవడంతో సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గిల్ 12వ స్థానంలో ఉన్నాడు. పంత్, గిల్ రాణించడంతో బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో భారత్ తన పట్టును మరింత బిగించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!