

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌కు సరదాగా క్షమాపణలు కూడా చెప్పాడు.
మేజర్ లీగ్ క్రికెట్ 2026లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ తరఫున ఆడిన పొలార్డ్ 56 బంతుల్లో శతకం సాధించాడు. వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద గేల్ రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకు 736 టీ20 మ్యాచ్‌ల్లో 14,582 పరుగులు చేసిన పొలార్డ్ అగ్రస్థానంలో నిలవగా, 14,562 పరుగులతో గేల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన పొలార్డ్, తనకు స్ఫూర్తిగా నిలిచిన గేల్ రికార్డును అధిగమించడం ప్రత్యేకమని చెప్పాడు. దిగువ వరుసలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని, మ్యాచ్‌ను ముగించే బాధ్యతను తాను సవాల్‌గా స్వీకరించానని తెలిపాడు. ప్రస్తుతం క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా ఒక పెద్ద వ్యవస్థగా మారిందని వ్యాఖ్యానించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!