
క్రీడలు

ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో, కొందరు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సమాచారం ప్రకారం, రూ.1,500 విలువైన టికెట్లను రూ.8,000కిపైగా అమ్ముతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు.
స్టేడియం చుట్టుపక్కల యువకులు తిరుగుతూ అభిమానులకు అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బ్లాక్ టికెట్ల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాయి. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివస్తుండటంతో స్టేడియం వద్ద భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!