
.webp&w=3840&q=75)
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని గతంలో ప్రకటించిన పీసీబీ, ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో కాస్త మెట్టు దిగింది.
నిన్న లాహోర్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పీసీబీ మూడు డిమాండ్లను ఉంచింది. టోర్నీ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌కు పెరిగిన పరిహారం అందించాలని, టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ ఆ జట్టుకు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని, భవిష్యత్తులో జరగబోయే ఏదైనా ఐసీసీ ఈవెంట్‌కు తమకు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ షరతులు పెట్టినట్లు సమాచారం.
కొలంబోలో ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీలోని కొందరు అధికారులు సుముఖంగా ఉన్నప్పటికీ, బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఈ విషయంలో సహకరించడం లేదని సమాచారం. ఇవాళ ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మరోసారి సమావేశమై, తుది నిర్ణయం తీసుకోనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!