
గాసిప్స్

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో సైడ్ స్ట్రెయిన్ గాయానికి గురైన రిషభ్ పంత్ మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండడని సమాచారం. ప్రధాన వికెట్‌కీపర్‌గా ఉన్న పంత్ గాయం జట్టు కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ సిరీస్ పంత్‌కు ఫామ్‌లోకి తిరిగి రావడానికి కీలకంగా మారుతుందని భావించిన సమయంలో ఈ గాయం నిరాశ కలిగించింది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో ఆయన బరిలోకి దిగరని స్పష్టమైంది. ప్రస్తుతం పంత్ గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉండగా, వికెట్‌కీపర్ స్థానానికి టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!