

టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశలో భారత్తో మ్యాచ్లను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ స్పష్టం చేసింది. క్రికెట్ ప్రపంచంలో అన్ని దేశాలు పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తిని పాటించాలని పేర్కొన్న ఐసీసీ, ఈ నిర్ణయంపై పీసీబీ పునరాలోచన చేయాలని సూచించింది.
ఐసీసీ టోర్నమెంట్లు క్రీడా సమగ్రత, పోటీతత్వం, న్యాయబద్ధతతో నిర్వహించబడతాయని పేర్కొంది. ఎంపికైన జట్లు టోర్నీలో పాల్గొనడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని, నిబంధనల ఉల్లంఘన క్రీడా పవిత్రతను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. జాతీయ విధానాల విషయంలో ప్రభుత్వాల పాత్రను గౌరవించినప్పటికీ, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. పీసీబీ దీర్ఘకాల ప్రయోజనాలు, దేశంలో క్రికెట్కు లభించే ఆదరణను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఐసీసీ వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!