

ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ జట్టు 2–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్ 296 పరుగులకు ఆలౌటైంది.
న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో చెలరేగి నాలుగో వికెట్‌కు 219 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. విల్ యంగ్ 30 పరుగులు చేయగా, మైఖేల్ బ్రాస్‌వెల్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌కు ఒక్కో వికెట్ లభించింది.
భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడుతూ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (53) మరియు హర్షిత్ రాణా (52) కీలక సహకారం అందించినప్పటికీ భారత్ ఓటమిని తప్పించుకోలేకపోయింది. శుభ్‌మన్ గిల్ (23), రోహిత్ శర్మ (11), రవీంద్ర జడేజా (12) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా, శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్, జాక్ ఫౌక్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, లెనాక్స్ రెండు, కైల్ జేమీసన్ ఒక వికెట్ తీశారు.
ఈ విజయంతో భారత్ గడ్డపై తొలిసారిగా వన్డే సిరీస్ గెలిచి, న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.
భారత్‌లో జరిగిన భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఫలితాలు
1988 – భారత్ విజయం (4–0)
1995 – భారత్ విజయం (3–2)
1999 – భారత్ విజయం (3–2)
2010 – భారత్ విజయం (5–0)
2016 – భారత్ విజయం (3–2)
2017 – భారత్ విజయం (2–1)
2023 – భారత్ విజయం (3–0)
2026 – భారత్ ఓటమి (1–2)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!