
జనరల్

ఎంఎస్ ధోనీ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ ఆడకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు నిరాశకు గురయ్యారు. సీఎస్కే ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ, ధోనీ మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వచ్చే సీజన్లో ధోనీ మళ్లీ యెల్లో జెర్సీలో కనిపిస్తాడా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం పూర్తిగా మేనేజ్మెంట్ చేతుల్లోనే ఉందన్నారు. మైదానంలో ఆడకపోయినా యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా ధోనీ జట్టుపై గొప్ప ప్రభావం చూపిస్తున్నాడని తెలిపారు. మరోవైపు మాజీ క్రికెటర్ సురేశ్ రైనాతో జరిగిన సంభాషణలో “శరీరం సహకరించడం లేదు” అని ధోనీ చెప్పినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!