
గాసిప్స్

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా పేసర్ హర్షిత్ రాణా టోర్నీకి దూరమవగా, అతని స్థానంలో అనుభవజ్ఞుడైన మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు కల్పించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో హర్షిత్ రాణాను జట్టులో కొనసాగించడం సాధ్యం కాలేదని పేర్కొంది.
మహ్మద్ సిరాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్లో మంచి అనుభవం ఉండటంతో, భారత బౌలింగ్ విభాగానికి ఆయన చేరిక బలాన్ని చేకూర్చనుంది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో సిరాజ్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ మార్పుతో టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు బౌలింగ్ దాడి మరింత పటిష్టంగా మారనుంది.













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!