

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అయితే ఈ మెగా టోర్నీలో అందరి దృష్టి రెండు దిగ్గజాలైన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలపైనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఈ స్టార్ ఆటగాళ్లు తమ కెరీర్లో ఆరో ప్రపంచకప్ ఆడుతున్నారు. ఇది వారి చివరి ప్రపంచకప్ కావచ్చనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఎన్నోసార్లు తలపడిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటివరకు ప్రపంచకప్‌లో తమ జాతీయ జట్ల తరఫున మాత్రం ఎదురెదురుగా ఆడలేదు.
2026 ప్రపంచకప్ కొత్త ఫార్మాట్ కారణంగా మెస్సీ, రొనాల్డో మధ్య డ్రీమ్ క్లాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్జెంటీనా, పోర్చుగల్ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిచి నాకౌట్ దశల్లో విజయాలు సాధిస్తే క్వార్టర్ ఫైనల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు తలపడే అవకాశం ఉంది. ఇదే సమయంలో మెస్సీ ఇప్పటికే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. మరో మూడు గోల్స్ చేస్తే మిరోస్లావ్ క్లోజే అత్యధిక గోల్స్ రికార్డును సమం చేసే అవకాశం ఉంది. రొనాల్డో కూడా టోర్నీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!