

పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్‌లు ఈసారి కొత్త ఫార్మాట్‌లో జరగనున్నాయి. బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలు ఆగస్టు 15 నుంచి 30 వరకు కొనసాగనున్నాయి. తొలి దశలో 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజిస్తారు. ఒక్కో పూల్‌లో నాలుగు జట్లు ఉండగా, ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి దశ ఫలితాల ఆధారంగా తదుపరి దశకు జట్లను ఎంపిక చేస్తారు.
ఆగస్టు 21 నుంచి 24 వరకు క్రాస్‌ఓవర్ పూల్స్ నిర్వహిస్తారు. పూల్ ఏ, డిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పూల్ ఈలో, పూల్ బి, సిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పూల్ ఎఫ్‌లో ఉంటాయి. మిగిలిన జట్లతో జి, హెచ్ పూల్స్ ఏర్పడతాయి. పూల్ ఈ, ఎఫ్‌లో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో ఈసారి క్వార్టర్‌ఫైనల్స్ ఉండవు. 5 నుంచి 16వ స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 29న మహిళల ఫైనల్ నెదర్లాండ్స్‌లో, ఆగస్టు 30న పురుషుల ఫైనల్ బెల్జియంలో జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!