
గాసిప్స్

యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌ను కాస్త తేడాతో కోల్పోయాడు. చైనీస్ తైపీ క్రీడాకారుడు సు లియాంగ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గంటకుపైగా జరిగిన పోరులో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో పుంజుకున్నాడు. కానీ నిర్ణాయక గేమ్‌లో ప్రత్యర్థి వేగానికి తట్టుకోలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో స్కోర్ 15-21, 21-16, 9-21గా నమోదైంది. 33 ఏళ్ల మాజీ వరల్డ్ నంబర్ వన్ శ్రీకాంత్ ఈ సీజన్‌లో తన మొదటి ఫైనల్ ఆడగా మంచి ఆరంభం చేసినప్పటికీ అనవసర తప్పిదాలు అతనికి దెబ్బతీశాయి. గతంలోనూ అనేక టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ స్థిరమైన ప్రదర్శనతో కొనసాగుతున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!