
జనరల్

టీజీ20 లీగ్ 2026లో వరంగల్ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌కు తొలి ఓవర్‌లోనే ఓపెనర్ సాత్విక్ రెడ్డి (4) వికెట్ కోల్పోయినా, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుతమైన శతకంతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అతడు 61 బంతుల్లో 133 పరుగులు చేసి, 15 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 27 బంతుల్లో అర్ధశతకం, 52 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.
హృషికేశ్ సింహ (24), చందన్ సహాని (16), రాహుల్ రాదేశ్ (15*) తమవంతు సహకారం అందించడంతో కరీంనగర్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. వరంగల్ వారియర్స్ బౌలర్లలో ముదస్సర్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలో వికెట్ సాధించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!