
రాజకీయాలు

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయి బౌలర్లపై ఆధిపత్యం చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 400 పరుగులు పూర్తి చేసిన అతడి ప్రతిభపై ఓ పాక్ క్రికెట్ విశ్లేషకుడు ‘ఏఐ చిప్ ఉన్న బ్యాట్ వాడుతున్నాడా?’ అంటూ విమర్శలు చేశాడు. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ సరదాగా “అతడిని ఏఐతో తయారు చేశారా?” అంటూ వ్యాఖ్యానించాడు.
జోఫ్రా ఆర్చర్‌తో తన సంభాషణను గుర్తు చేసిన బట్లర్, వైభవ్ నిజంగా అసాధారణ ప్రతిభ కలిగిన క్రికెటర్ అని చెప్పాడు. బుమ్రా, హేజిల్‌వుడ్, కమిన్స్ వంటి టాప్ బౌలర్ల తొలి బంతులను సిక్స్‌లుగా మార్చిన విషయం అతడి ధైర్యాన్ని చూపుతుందని తెలిపాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే సామర్థ్యం వైభవ్‌లో ఉందని, త్వరలోనే ఇంగ్లాండ్‌లో అతడిని చూడొచ్చని బట్లర్ అభిప్రాయపడ్డాడు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!